ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : జల్లికట్టు పండుగ నిషేధించడం వలన గ్రామాలలో పండుగలు జరప రాదని స్థానిక ఎస్సై వెంకట నరసింహులు పేర్కొన్నారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పల్లెల్లో పశువుల పండుగ దూడల పండుగలు జరుపుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని మండలంలోని వివిధ గ్రామాలలో దూడల పండుగలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అలాంటి పండుగలు జరపరాదన్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిపితే గ్రామ నిర్వహణలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపితే గాని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్ ఐ వెంకట నరసింహులు ఒక ప్రకటనలో తెలియపరిచారు.










