Apr 02,2023 15:09

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీ భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) యూనిట్ కమిటీ నాయకులను ఐదుగురిని హాస్టల్ నుండి సస్పెండ్ చేయడాన్ని ఎస్.ఎఫ్.ఐ ఎస్కేయు శాఖ తరుపున ఖండిస్తున్నది. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యచంద్ర యాదవ్ మాట్లాడుతూ విభజన హామీల భాగంగా అనంతపురంలో ఏర్పాటయిన సెంట్రల్ యూనివర్సిటీ సమస్యల నిలయాలుగా మారిందని అన్నారు. ఉన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్ధుల తరుపున ఎస్ఎఫ్ఐ సెంట్రల్ యూనివర్సిటీ కమిటీ పలుమార్లు ప్రాంగణంలో ఆందోళనలు నిర్వహించింది. ఈ మధ్య కాలంలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకల్లో యూనివర్శిటీ డీన్ పాత్రను తప్పుపడుతూ యూనిట్ కమిటీ విసికి ఇచ్చిన వినతిని యునివర్సిటీ గోడకు అంటించినందుకు ఐదుగురు ఎస్.ఎఫ్.ఐ నాయకత్వాన్ని హాస్టల్ నుండి సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. డీన్ పై చర్యలు తీసుకోవలసిన విసి ఫిర్యాదు చేసిన వారిపై చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. యూనివర్శిటీలో విద్యార్ధి సంఘాలుకు మాట్లాడే స్వేచ్ఛను అధికారుల హరిస్తున్నరని వాపోయారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని భారత విద్యార్ధి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని అన్నారు. లేని పక్షంలో ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు రుషి, ఎస్కేయు శాఖ  నాయకులు సందీప్, అనిల్ కుమార్, సన్నీ, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.