- ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ సెలవు రోజులలో తరగతులు
ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలో ఉన్న నారాయణ కళాశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో కూడా తరగతులు తరగతులు నిర్వహిస్తున్న ఏ మాత్రం చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని విద్యార్థులకు పరీక్ష సమయంలో కూడా తరగతుల నిర్వహిస్తూ విద్యార్థులకు మానసిక వేదనకు గురిచేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ధనర్జనమే ధ్యేయంగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న నారాయణ కళాశాల యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి చంద్రశేఖర్, ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు నిహాల్ ఫర్ దిన్ నవీన్ నాసిర్ పాల్గొన్నారు.










