Jun 04,2023 15:38

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : ఖరీఫ్ సీజన్ కు సంబంధించి,బైరెడ్డిపల్లి మండలం, బైరెడ్డిపల్లి పంచాయతీ రైతులకు స్థానిక వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేరుశెనగ విత్తనాలను బైరెడ్డిపల్లి ఆర్ బి కే కేంద్రం నందు వ్యవసాయ అధికారి మునికృష్ణ అధ్యక్షతన ఆదివారం రాజంపేట నియోజకవర్గం ఎలక్షన్ అబ్జర్వర్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి  కుప్పం నియోజకవర్గం ఎలక్షన్ అబ్జర్వర్ మరియు బైరెడ్డిపల్లి మండల ఎంపీపీ మొగసాల రెడ్డప్ప ఎంపీడీవో రాజేంద్ర బాలాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డ్ మెంబర్లు, సోషల్ మీడియా సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కలసి రైతులకు వేరు శనిగ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ రెడ్డప్ప రైతులు తీసుకున్న వేరుశనగ విత్తనాలను రైతులతో కలసి క్షుణ్ణంగా పరిశీలించి కాయలు నాణ్యతగా ఉన్నట్లు గుర్తించారు.