ప్రజాశక్తి-పుట్లూరు : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొని ఇచ్చిన భూములు అప్పగించాలని అనంతపురం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి పుట్లూరు మండల సిపిఐ కార్యదర్శి డి.పెద్దయ్య ఆధ్వర్యంలో దళితుల భూములు గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి నియోజవర్గ కార్యదర్శి T. నారాయణస్వామి పాల్గొని మాట్లాడుతూ పుట్లూరు మండలం అరకటవేముల గ్రామం నందు 1999 సంవత్సరంలో సంవత్సరములో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అరకట వేముల గ్రామ రెవెన్యూ పొలం నందు 61 మంది భూములేని దళిత ల కు సూరేపల్లి గ్రామ రెవెన్యూ పొలం నందు పదిమంది కి భూమిలేని దళితులకు రైతుల వద్ద నుంచి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు జరిపి భూమిలేని దళితులకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల పై సిల్క్ భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినది. అప్పటినుంచి ఆ భూములను సాగు చేస్తే దళిత రైతులు జీవనం సాగిస్తున్నారు. ఈ భూములు స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయామ్ లో అప్పు రద్దు చేయబడినది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ రైల్వే అధికారులు ఎస్సీ కార్పొరేషన్ వారు ఇచ్చిన భూముల ను సర్వే చేయడం కూడా జరిగినది. కనుక ఈ భూముల ను దళిత రైతులకు మంజూరు చేసిన భూ రిజిస్టర్ పత్రాలను లబ్ధిదారులైన దళిత రైతులకు వెంటనే ఇవ్వాలని దళిత రైతుల తరపున సీపీఐ ద్వారా కోరుతున్నాం' అన్నారు. రైతు సంఘం నాయకులు పెద్ద కొండయ్య రైతులు వెంకటనారాయణ, చిన్న కొండయ్య,R. పెద్ద కొండయ్య, గురయ్య,రాజు, పెద్దయ్య, రామచంద్ర, శంకర ,చిన్నారయ్య, వెంకటేష్, బాల గురయ్య, బాల్ లక్ష్మయ్య ,సూరి, తదితరులు పాల్గొన్నారు.










