మహిళల ఆనంద హేళ
ప్రజాశక్తి- తిరుమల:
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వరోజైన ఆదివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కపాకటాక్షాలతో అనుగ్రహించాడు. దాసభక్తుల నత్యాలతోను, భజనబందాల కోలాహలం, మంగళవాయిధ్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథన్ని లాగారు. శ్రీవారికి శ్రీభూదేవులు ఇరుపక్కలా ఉన్నారు. శ్రీదేవి(లక్ష్మి) సువర్ణమయి. ఆమే బంగారు కాగా ఆమెను భరించే స్వామికి బంగారురథంలో ఊరేగడం ఎంతో ఆనందం. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహాశక్తిమంతమైన లోహం. స్వామివారికి కష్ణావతారంలో దారుకుడు సారథి, శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేవి నాలుగు గుర్రాలు. శ్రీవారి ఇల్లు బంగారం, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు, సింహాసనం బంగారుది, కావున స్వర్ణరథం శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్త ధాన్యాలూ, శ్రీవారి కరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈకార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి దంపతులు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, బోర్డు సభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సనత్ కుమార్, నందకుమార్, మారుతీ ప్రసాద్, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హనుమంత వాహనంపై
వేంకటాద్రిరామునిగా శ్రీమలయప్పస్వామివారు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. వాహనం ముందు భక్తజన బందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవలలో పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్‌స్వామి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదరు ఉమేష్ లలిత్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్, నందకుమార్, ఢిల్లీ స్థానికి సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, విజిఓ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు పాల్గొన్నారు.










