పల్నాడు జిల్లా: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసా యిదా ఓటర్ల జాబితాను బూత్ స్థాయి అధికారులు అందరికీ అందజేసి అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రచు రించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎల్.శివ శంకర్ అన్నారు. జిల్లా అధికారులు, ఎన్నికల అధికారులు, క్షేత్రా ధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సం దర్భంగా శివశంకర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల జాబితా ప్రచురించినట్లుగా ధ్రువీకరణ పత్రాలను ఈఆర్వోలు (ఓటర్ల నమోదు అధికారులు) సంతకం చేసి పం పాలన్నారు. ఈఆర్‌వో నెట్, బిఎల్‌ఒ యాప్‌లు శనివారం ఓపెన్ అవుతాయని చెప్పారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు తొలగింపు నకు సంబంధించిన ఫారం 6,7, 8 లను వెంటనే పరి ష్కరించి అప్‌లోడ్ చేయాలన్నారు. కొత్తగా వచ్చే దరఖాస్తు లను కూడా ఎప్పటికప్పుడు విచారించి నవంబర్ 21వ తేదీలోగా తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని చెప్పారు. అంతే కాకుండా ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలలో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కచ్చితంగా అందుబాటులో ఉండాలని, ఫారం 6, 7, 8 లను స్వీక రించడంతో పాటు అవసరమైన వారికి సహాయం చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠ శాలల్లో బిఎల్‌ఒ లకు కావలసిన అన్ని వసతులు సజా వుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని అన్నారు. గతంలో ఏవైతే అభ్యంతరాలు, ఆరోపణలు వచ్చాయో వాటిని దృష్టిలో పెట్టుకుని అటువంటి లోటుపాట్లు, పొరపాట్లు లేకుండా తప్పనిసరిగా ఓటర్ల జాబితాను సరిచేసుకోవాల న్నారు. ఎవరైనా స్పందించకపోతే అటువంటి వారిపై వెంటనే క్రమ శిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి కారితో సంప్రదించి పరిష్కరి స్తామన్నారు.
లింగ నిర్ధారణ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలి
పల్నాడు జిల్లాలో లింగ నిర్ధారణ చట్టం సమర్థవం తంగా అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు ఉన్న తాధికారులను జిల్లా కలెక్టర్ ఎల్. శివశంకర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్ శం కరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో శనివారం జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్ప్రొప్రైట్ ఆధారిటీ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ చట్టం -1994 ను సమర్థవంతంగా అమలు చేయాలని, ఈ చట్టం పరిధిని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని, లింగ నిర్ధారణ చేసినట్లు తెలిస్తే చట్ట పరిధిలో శిక్షారులవుతారని హెచ్చ రించారు.
జిల్లాలో ఇప్పటివరకు 156 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు లింగ నిర్ధారణ చట్టము పరిధి కింద అను మతులు ఇవ్వబడ్డాయని, వీరందరూ కూడా చట్టం ప్రకారం అన్ని రికార్డులను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో కొత్తగా 6 స్కాన్ సెంటర్లకు, 5 రెన్యు వల్స్ కు, మార్పుల కోసం నమోదు చేసుకున్న వారికి లింగ నిర్ధారణ చట్టం కింద అనుమతులు మంజూరు చేశారు. సమావేశంలో డిఎంఅండ్‌హెచ్‌ఒ బి.రవి , నోడల్ అధికారిణి డాక్టర్ బి. గీతాంజలి,రెడ్ క్రాస్ సొసైటీ సభ్యు రాలు డాక్టర్ ఎం. వసంత కిరణ్, పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రవిచంద్ర, నరసరావుపేట డిఎస్పీ కెవి మహేష్, డిప్యూటీ డిఎంఅండ ్‌హెచ్‌ఒ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్. నాగపద్మజ, డాక్టర్ హనుమకుమార్, షేక్ ఖాజావళీ పాల్గొన్నారు.










