Oct 25,2022 20:55

స్వచ్ఛ సర్వేక్షన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మంత్రి పెద్దిరెడ్డి
మంత్రిని కలిసిన కమిషనర్‌ అరుణ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

రాష్ట్ర అటవీ, విద్యుత్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక భూగర్భ గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం కమిషనర్‌ తిరుపతిలో రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న పలు అభివద్ధి కార్యక్రమాలపై మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షన్‌ చిత్తూరు నగరపాలక సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండాలని కమిషనర్‌ మంత్రిని కోరగా ఆయన అంగీకరించారు. స్వచ్ఛసర్వేక్షన్‌ పోటీల్లో అత్యుత్తమ ర్యాంకు సాధనకు కషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.