Oct 02,2023 21:47

ఫొటో : కోర్టు ఆవరణంలో శుభ్రం చేస్తున్న న్యాయవాదులు

'స్వచ్ఛ భారత్‌'లో జడ్జీలు
ప్రజాశక్తి-కావలి : న్యాయస్థాన భవన సముదాయాల్లో సోమవారం నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో కావలి న్యాయమూర్తులు పాల్గొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని కావలి కోర్టు ఆవరణంలో సీనియర్‌ సివిల్‌ జడ్జీ ఎం.శోభ నేతృత్వంలో స్వచ్ఛ భారత్‌ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా చక్కటి వాతావరణం పొందవచ్చని ఆమె తెలిపారు.
అలాగే మున్సిపల్‌ అధికారులు కూడా కోర్టు పరిసర ప్రాంతాలలో శుభ్రతకు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వరలక్ష్మీ, కోర్టు సిబ్బంది, న్యాయ వాదులు జి.క్రిష్టమోహన్‌, కె.సురేంద్ర రెడ్డి, ఐ.సాయి ప్రసాద్‌, ఎం.సురేష్‌, కె.బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.