Apr 02,2022 17:44

ప్రజాశక్తి-నాయుడుపేట: కొంతమంది ప్రయోజనాల కోసం దాదాపుగా తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న ఆర్డీవో కార్యాలయాన్ని రాష్ట్ర తీరప్రాంతానికి తరిలించుకుపోవడం సరికాదని నాయుడుపేట ఆర్డీవో కార్యాలయ పరిరక్షణ సమితి తాత్కాలిక కన్వీనర్ స్ధానిక సీనియర్ న్యాయవాది వెందోటి.పార్థసారథి రెడ్డి అన్నారు. ఈ నెల రెండవ తేదీ శనివారం జరిగిన నాయుడుపేట ఆర్డీవో పరిరక్షణ సమితి కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ పారిశ్రామిక నేత సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తడ మండలానికి తరలించడాన్ని నాయుడుపేట ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్న కార్యాలయాన్ని తరిలించాల్సిన అవసరమేంటని ఆయన ప్రజలతరపున ప్రశ్నించారు ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని హెచ్చరించారు. సోమవారం నుంచి నిరసనలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేపట్టనున్నామని అయన తెలిపారు.