సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ
ప్రజాశక్తి-తిరుపతి సిటి:
మిగిలిన రాష్ట్రాల్లో సైతం బిజెపికి ఓట్ల శాతం భారీగా తగ్గిందన్నారు. బుధవారం తిరుపతిలో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం పంజాబ్ ఎన్నికల్లో ప్రభావం చూపిందని అన్నారు. ఇదే ఫలితాలు కేంద్ర ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా రావలసిన అవసరం ఉందన్నారు. దేశంలో నీరు, భూమి, శ్రమశక్తి, వంటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పాలకవర్గాల నిర్లక్ష్యంతో నేటికీ రైతాంగం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందన్నారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించిన సిఫార్సులు దేశం మొత్తం స్వాగతించినా, నేటికీ అవి అమలు కావడం లేదని చెప్పారు. ఇప్పటికైనా స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు కాటమయ్య, గంగాభవాని, చంద్ర, చిత్తూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జనార్ధన్, నరసింహులు పాల్గొన్నారు.










