ప్రజాశక్తి-నెల్లూరు : సుస్థిర అభివద్ధి లక్ష్యాల సాధనపై ప్రత్యేక దష్టి సారించి నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేలా కషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి కలెక్టర్ ఎం.హరినారాయణన్‌ను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు జరుగుతున్న సుస్థిర అభివద్ధి లక్ష్యాలలో భాగంగా ప్రాధాన్యత ఇండికేటర్స్ లక్ష్య సాధన, మహిళల ఆరోగ్యం, పిల్లల సంక్షేమం, విద్య, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సరఫరా, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 100 శాతం అమలు, విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర, నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో చేపడుతున్న పనుల పురోగతి, జగనన్నకు చెబుదాం తదితర అంశాల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నుంచి హాజరైన కలెక్టర్ ఎం. హరినారాయణన్ హాజరై మాట్లాడారు. జిల్లాలో గ్రామ, వార్డు స్థాయి బాల్య వివాహాల నిరో ధక కమిటీలను ఏర్పాటుచేసి బాల్య వివాహాలను అరికట్టేందుకు, నిరోదించేందుకు ప్రజల్లో విస్తతంగా అవగాహన కల్పించేలా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. డిఆర్‌డిఎ పీడీ సా వారెడ్డి, డిఎం అండ్ హెచ్‌ఓ డా. పెంచలయ్య, డిసిహెచ్ ఎస్ రమేష్ నాథ్, డిఇఒ గంగా భవాని, సమగ్ర శిక్ష ఎపిసి ఉషారాణి, ఐసిడిఎస్ పిడి హేనా సుజన పాల్గొన్నారు.










