అనంతపురం కలెక్టరేట్ : ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తి అనుసరనీయమని, ఆయన వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ పేర్కొన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహించారు. సుందరయ్య చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతపురం ఒకటవ నగర కమిటీ ఆధ్వర్యంలో గణేనాయక్, మహదేవ్‌నగర్ కాలనీ, శ్రీశ్రీ నగర్‌లో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంభూపాల్ హాజరై సుందరయ్య జీవిత విశేషాలను తెలియజేశారు. సుందరయ్య మార్క్సిస్టు, లెనినిస్టు మూలసూత్రాల ప్రాతిపదికతో ప్రజాల కోసం విశాల పోరాటాలు నిర్మించారన్నారు. దేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఆయన స్ఫూర్తితో వామపక్ష పోరాటాన్ని ముందుకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం 1వ నగర కార్యదర్శి వి.రామిరెడ్డి, నగర నాయకులు ప్రకాష్, వలీ, మసూద్, బాబు, ప్రసాద్, ముష్కిన్, వెంకటనారాయణ, జీవ, ఎన్టీఆర్ శీన, వెంకటేష్ గణేనాయక్ నగర్ శాఖ కార్యదర్శులు వన్నూరు, దేవా, పెద్ద మసూదు, వెంకట, కృష్ణ, మహదేవ్ నగర్ శాఖ కార్యదర్శి ఎస్‌కె.మహమ్మద్, వెంకట, ఎంపీటీసీ రమీజాబీ, వార్డు సభ్యురాలు రమాదేవి, రసూల్‌బీ, శ్రీశ్రీ నగర్ కాలనీ శాఖ కార్యదర్శులు కుమార్, హరి, రాఘవ, కుళ్లాయి, జైతున్‌బీ, సావిత్రమ్మ, సురేష్ పాల్గొన్నారు.










