Aug 08,2022 23:03

సుందరీకరణ పనులు వేగవంతం చేయండి: కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

నగరంలోని గాంధీ విగ్రహ కూడలి వద్ద చేపడుతున్న సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం నగర కమిషనర్‌ గాంధీ విగ్రహ కూడలి వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. పార్కులో లైటింగ్‌ పనులను ఆగస్టు 14వ తేదీ కల్లా పూర్తిచేయాలని ఆదేశించారు. జరుగుతున్న పనులపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం కమిషనర్‌ రైల్వే పైవంతెన పై జరుగుతున్న పెయింటింగ్‌ పనులను పరిశీలించారు. పంద్రాగస్టు నాటికి పెయింటింగ్‌ పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ ధనలక్ష్మీ, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.