ప్రజాశక్తి-ఉరవకొండ రైతులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా క్రాప్‌లోన్ రెన్యువల్ చేయాలని కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి, ఎస్సీ,ఎస్టీ జిల్లా మానిటరింగ్ నాయకులు మొలకా బాల రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం పట్టణంలోని కెనరా బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో క్రాప్‌లోన్ రెన్యువల్ ఫారాలను రైతులకు బ్యాంకులోనే సరఫరా చేసే వారన్నారు. ప్రస్తుతం రెన్యువల్ ఫారాలను బయట ప్రయివేట్ వ్యక్తుల వద్ద జిరాక్స్ సెంటర్లలో తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే బ్యాంకులో మౌలిక వసతులు కూడా లేకపోవడంతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించడంతోపాటు రైతులకు ఇబ్బందులు లేకుండా లోన్ రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు సిద్ధప్ప, పర్వత రెడ్డి, సీనప్ప, రామాంజిని, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
కెనరా బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడుతున్నకౌలు రైతుసంఘం నాయకులు










