Apr 03,2022 23:09

విద్యార్ధులను అభినందిస్తున్న ఉపకులపతి రాజారెడ్డి


ప్రజాశక్తి-క్యాంపస్‌:
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిర్వహించిన జూనియర్‌ సివిల్‌ జడ్జిల పరీక్షల్లో ఎస్వీయూలో తొలి బ్యాచ్‌(2015-2020) బిఏయల్‌యల్‌బి విద్యార్థి ఎం.అనిల్‌కుమార్‌నాయక్‌, మూడవ బ్యాచ్‌ (2017-2022) విద్యార్థిని జె.నందిని జూనియర్‌ సివిల్‌ జడ్జిలుగా ఎంపికైరయ్యారు. అలాగే న్యాయశాస్త్ర విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న వైష్ణవి ఆర్చరీలో రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో బంగారు పథకాన్ని సాధించారు. అత్యుత్తమ ప్రతిభా పాఠవాలు కనబరచిన విద్యార్థులను విసి రాజారెడ్డి అభినందించారు. ఉపకులపతి రాజారెడ్డి మాట్లాడుతూ ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయానికి దక్కుతుందన్నారు. చేరిన రోజు నుండి అంకిత భావంతో, ఏకాగ్రతతో చదువుకున్న విద్యార్థి జీవితం బంగారు మయమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి తల్లితండ్రుల ఆశలను ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సాకారం చేసువాలని కోరారు. చదివేకోర్సును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే మంచి భవిష్యత్‌ వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హానరరీ డీన్‌ ఆచార్య విఆర్‌సి కష్ణయ్య, అకడమిక్‌ కన్సల్టెంట్లు అంజన్‌ సింగ్‌, భవ్య,సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.