Oct 04,2023 22:13

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - గార: 
జిల్లాలో శత శాతం ఈ-క్రాప్‌ నమోదు పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. మండలంలోని అంపోలు, శ్రీకూర్మం ప్రాంతాల్లో పంట క్షేత్రాలను బుధవారం పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన పంట నమోదు రికార్డులను పరిశీలించారు. పంట విస్తీర్ణం, పంట రకం, పాసు పుస్తకాలు, ఈ-పంట నమోదు యాప్‌లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ-క్రాప్‌ నమోదు సమయంలో బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆయనతో పాటు వ్యవసాయశాఖ జెడి కె.శ్రీధర్‌, శ్రీకాకుళం ఎడి రజని, తహశీల్దార్‌, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.