Mar 10,2022 22:32

నివాళులర్పిస్తున్న దృశ్యం


ప్రజాశక్తి - క్యాంపస్‌, యంత్రాంగం
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌ శ్రావణి, ఉపాధ్యక్షులు రవి, ఉరుకుందు మాట్లాడుతూ నూతన వ్యవస్థ కోసం, ప్రాణాలను సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేసిన ధీరత్వం కలిగిన సావిత్రిబాయి పూలె నేటి యువతకు ఆదర్శమన్నారు. కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన వ్యక్తులందరికీ సావిత్రిభాయి పూలె నిర్ణయాలు ఒక గుణపాఠం చెప్పాయని కీర్తించారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలన్నారు. ప్లేగ్‌లాంటి ప్రాణాంతకమైన వ్యాధి ప్రబలినపుడు ఆ సమయంలో మొక్కవోని ధైర్యంతో వేలాదిమందికి ఆమె సేవలందించిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ, శ్రీహరి, రంగస్వామి, విజరు, మధులత, సుశీల, మహేష్‌, శ్రావణ్‌, సాయితేజ, పృధ్వీ, అశోక్‌ పాల్గొన్నారు. ఎస్వీయూ క్యాంపస్‌ హైస్కూల్‌, మంగళం ప్రాంతంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష కార్యదర్శి ప్రసన్నకుమార్‌, నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది.
శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో సావిత్రిబాయి పూలె వర్థంతి సభ జరిగింది. రిజిష్ట్రార్‌ మమత మాట్లాడుతూ భారతదేశ మహిళల విముక్తి కోసం ఉద్యమం చేసిన గొప్ప మహిళని కొనియాడారు. న్యాయశాఖ ప్రొఫెసర్‌ సీతాకుమారి మాట్లాడుతూ స్త్రీ స్వాతంత్య్రం గురించి ఆనాటినుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారన్నారు.
ఎపి బీసీ విద్యార్థిసంఘం అధ్యక్షులు డాక్టర్‌ నారాయణగౌడ్‌ ఆధ్వర్యంలో ఎస్వీయూ ప్రధాన ద్వారం వద్ద జరిగింది. ఉపకులపతి ఆచార్య రాజారెడ్డి పాల్గొన్నారు. ఈరోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆ ఘనత సావిత్రిబాయిపూలెకు మాత్రమే దక్కుతుందన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య హుస్సేన్‌, శాలివాహన రాష్ట్ర అధ్యక్షులు కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రకాశం భవన్‌లో జరిగింది. ఆర్ట్స్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ మురళీదర్‌, ఆచార్య స్టాన్లీన్‌, నాయకులు ఉదరు, చక్రి పాల్గొన్నారు.
తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు సాంబశివ, మదనపల్లి పట్టణ కార్యదర్శి దేవ, మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు సురేష్‌కుమార్‌ అన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు.