Jun 21,2022 22:07

స్టీరింగ్‌ మధ్యలో ఇరుక్కున డ్రైవర్‌
కాపాడిన 108 సిబ్బంది
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

ఆగి వున్న లారీని మరో లారీ ఢకొీన్న ప్రమాదంలో డ్రైవర్‌ స్టీరింగ్‌ మధ్యలో ఇరుక్కుపోయిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుడిపాల మండలం ఓరియన్‌ ఫ్యాక్టరీ వద్ద నున్న ఫ్లైఓవర్‌ పై (తిరుపతి- తిరువన్నామలై) వద్ద ఆగివున్న లారీని మరో లారీ వేగంగా ఢకొీంది. ఈ ప్రమాదంలో కరూరు వాసి అయిన డ్రైవర్‌ సేతుభూపతి (60) స్టీరింగ్‌ మధ్యలో ఇరుక్కుపోయాడు. అంతేకాకుండా ఎడమ కాలు ఓపెన్‌ ఫ్రాక్చర్‌ కావడంతో తీవ్రరక్తస్రావం అవ్వడంతో పాటు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది శివకుమార్‌, మగేష్‌లు దాదాపు గంట సేపు శ్రమించి డ్రైవర్‌ను స్టీరింగ్‌ నుంచి విడదీసి వైద్యం అందించారు. అప్పటికే అతని పరిస్థితి విషమించడంతో అత్యవసర వైద్యం అందించి డ్రైవర్‌ను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.