Mar 01,2023 21:08

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
స్టార్టప్స్‌ ఏర్పాటులో ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు అగ్రస్థానంలో నిలవాలని ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ సాగి రామకృష్ణ నిషాంత్‌ వర్మ పేర్కొన్నారు. కళాశాల టెక్నాలజీ సెంటర్‌కు చెందిన పలువురు విద్యార్థులు ఎం.సురేష్‌బాబు పర్యవేక్షణలో బుధవారం భీమవరం ఆన్‌లైన్‌ క్యాంపస్‌ కేఫ్‌ బైఎస్‌ఆర్‌కెఆర్‌ ప్రారంభించారు. కళాశాల పూర్వ విద్యార్థి రాజశేఖర్‌ పర్యవేక్షణలో బ్లైండ్‌ పీపుల్‌ కోసం స్మార్ట్‌ విజన్‌ బైఎస్‌ఆర్‌కెఆర్‌ అనే స్టార్టర్‌ను టెక్నాలజీ సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ ఎన్‌.గోపాలకృష్ణమూర్తి పర్యవేక్షణలో రూపొందించారు. రెండు స్టార్టప్‌లకు ఇటీవల ఎన్‌ఐటి తాడేపల్లిగూడెంలో జరిగిన వాల్కాన్సి ఫెస్ట్‌ - 23లో రెండు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలలో బుధవారం ఉదయం జరిగిన అభినందన కార్యక్రమంలో నిశాంత్‌ వర్మ విద్యార్థులను టెక్నాలజీ సెంటర్‌ హెడ్స్‌ను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ జగపతిరాజు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు దేశం నలుమూలల జరిగిన పలు హేక్తాన్‌ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొంది దేశంలోనే కళాశాలకు ఒక ప్రత్యేక స్థానం కల్పించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టెక్నాలజీ సెంటర్‌ హెడ్‌ ఎన్‌.గోపాలకృష్ణమూర్తి, సిఎస్‌డి విభాగం హెడ్‌ ఎం.సురేష్‌బాబు పాల్గొన్నారు.