ప్రజాశక్తి-నార్పల : శిద్దరాచెర్ల గ్రామపంచాయతి గొల్లపల్లి గ్రామం అంగనవాడి కేంద్రాన్ని బుధవారం సర్పంచ్ సాగే రామాంజనేయులు తనిఖీ చేసి పిల్లల హాజరు పట్టికను పరిశీలించి పిల్లలందరినీ సక్రమంగా అంగన్వాడి కేంద్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి పిల్లలందరికీ మెనూ ప్రకారం రుచికరమైన భోజనం పెట్టాలని తెలిపారు. అనంతరం బరువు ఎత్తులను చూశారు. వయసుకు తగ్గ ఎత్తుకు బరువుకు తేడా ఉన్న పిల్లలకి వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ఇంటి దగ్గర కూడా పోషక ఆహారాన్ని అందించి పిల్లలకు మంచి అలవాట్లను ఆటపాటలను చదువును నేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త వెలుగు తృణీత, హెల్పర్ దేవక్క, వాలంటీర్ పి సుజాత, గ్రామస్తులు హరినాథ్ పాల్గొన్నారు.










