శరవేగంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం
ఛైర్మన్ జమ్మన ప్రసన్నకుమార్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్, పుంగనూరు:
పూనేపల్లి వద్ద నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తిచేసి లబ్దిదార్లకు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టిడ్కో ఛైర్మన్ జమ్మన ప్రసన్నకుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక పూనేపల్లి వద్ద వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రకాల ఇళ్ల నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. పూనేపల్లి వద్ద నిర్మాణం అవుతున్న 300గజాల ఇళ్ల నిర్మాణం పూర్తి కావచ్చిందన్నారు. నెలరోజుల వ్యవధిలో లబ్దిదార్లకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి వసతి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యాతా ప్రమాణాలతో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్దిదార్లకు అందించనున్నట్లు తెలిపారు.
పుంగనూరు: టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఓ యజ్ఞం లాగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర టిడ్కో ఛైర్మన్ ప్రసన్న కుమార్‌రెడ్డి చెప్పారు. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని నక్కబండ ప్రాంతంలో నిర్మించిన టిడ్కో గహాలను రాష్ట్ర చైర్మన్, మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషా ఆదివారం సాయంత్రం పరిశీలించారు. రాష్ట్ర టిడ్కో చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అందిస్తున్న టిడ్కో గహాలు నిర్మాణాలు పూర్తయ్యాయని అవి లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఓ యజ్ఞం లాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని అన్నారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో శ్రీకాళహస్తి నుంచి పుంగనూరు మున్సిపాలిటీలో నిర్మిస్తున్న టిడ్కో గహాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే టిడ్కో ప్లాట్లు వద్ద మౌలికవసతులు కల్పించి సెప్టెంబర్ 10వ తేదీ లోపు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం టిడ్కో గహాలను ఒక రూపాయికే అందజేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,43 వేల గహాలను పేదలకు అందజేయడం జరిగిందన్నారు. పుంగనూరు మున్సిపాలిటీలో కూడా 1700 ఇండ్లను 1700 వందల రూపాయలకే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇది పేదలకు అత్యున్నతమైన కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చరిత్ర సష్టించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ మహేష్, టిడ్కో ఇన్‌ఛార్జ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.










