శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూత
ప్రజాశక్తి- తిరుమల
పాక్షిక సూర్యగ్రహాణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేసింది. మూలవిరాట్టు కొలువై ఉన్న గర్భాలయ బంగారువాకిలి మొదలుకొని మహాద్వారం వరకు అధికారులు, అర్చకుల సమక్షంలో సన్నిధిగొల్ల తాళాలు వేశారు. గ్రహాణ సందర్భంగా దాదాపు పది గంటల పాటు ఆలయం మూతలో ఉంటుందని, గ్రహణం పూర్తిగా విడిచిన అనంతరం రాత్రి 7.30 గంటల పైన ఆలయాన్ని తెరచి శుద్ధి , పుణ్యాహవచనం చేసినాంతరం సామన్యభక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గ్రహణం కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని కూడా టీటీడీ మూసివేసింది.










