Mar 21,2022 23:37

ఎంపిపి మోహితకు స్వాగతం పలుకుతున్న దృశ్యం


ప్రజాశక్తి - క్యాంపస్‌:
ఈ సంధర్భంగా వైయస్సార్‌ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బి.ఓబుల్‌రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో వర్శిటీ ఉపకులపతి ఆచార్య కె. రాజారెడ్డితో కలిసి పూజలు చేశారు. అనంతరం చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి పేరుతో ఏర్పాటైన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో శ్రీవారి ఆలయాన్ని ఏర్పాటుచేయడం శుభ పరిణామమన్నారు. ఇందుకు కషి చేసిన టిటిడి, ఎస్వీయూ అధికారులను ఆయన అభినందించారు. విద్యార్థులు, యువతలో భక్తి భావాన్ని పెంపొందించడానికీ, యూనివర్సిటీలో ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడానికి శ్రీవారి ఆలయ ఏర్పాటు మంచి ఫలితాలు ఇస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివారెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రదీప్‌, వెంకటరెడ్డి, రంగస్వామి, వెంకటేశ్వర్లు, భాస్కర్‌ రాయల్‌, ముబారక్‌, ఖాదర్‌ వల్లి, కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.