Sep 25,2023 21:45

కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు

           ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నీలంకఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పని చేస్తున్న కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం శ్రీరామిరెడ్డి తాగునీటి కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్య ంలో స్థానిక కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలే దీక్షలను మాజీ ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు చేసిన పనికి వేతనాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నా రు. వేతనాలు రాకపోతే కార్మికులు కుటుంబాలు ఎలా పోషించుకు ంటారని ప్రభుత్వం ఆలోచించి వేతనాలు చెల్లించాలన్నారు. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ చెల్లించాలన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ కార్మికుల డబ్బులు కాజేసిన కాంట్రాక్టర్‌ కలాంనాయుడుపై చర్యలు తీసుకుని డబ్బులను రికవరీ చేసి కార్మి కులకు చెల్లించాలని కోరారు. అనంతరం గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శ్రీసత్య సాయి జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు, సిపిఐంఎల్‌ జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న, ఎస్‌యుసిఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఏసురత్నం, సిఐటియు శ్రీసత్యసాయి జిల్లా నాయకులు లక్ష్మినారాయణ, శ్రీరామ్‌రెడ్డి కార్మికుల యూనియన్‌ నాయకులు సోమశేఖర్‌, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.