Jun 17,2022 22:49

శ్రీలంక కాలనీవాసుల సమస్యలు పరిష్కరించండి
ఇంటింటికీ సిపిఎంలో నాయకుల డిమాండ్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
శ్రీలంక కాలనీ ప్రజలను ప్రభుత్వం అన్నిరకాల ఆదుకోవాలి, సిపిఎం ఇంటింటి ప్రచారంలో ప్రభుత్వానికి నాయకులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సిపిఎం నాయకులు ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో శ్రీలంకకాలనీ, గంగాసాగరం, రెడ్డిగుంట కాలనీలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. శ్రీలంక శరనార్ధులకు స్థానిక రెడ్డిగుంట వద్ద కాలనీ ఏర్పాటుచేసి నివాసాలు ఏర్పాటు చేసి సమీపంలోని పట్టు పరిశ్రమలో ఉపాధి అవకాశాలు కల్పించారు. అయితే శ్రీలంక కాలనీ సమీపంలో రెడ్డిగుంట చెరువు నిండితే కాలనీ ముంపుకుగురై కాలనీ వాసులు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తోంది. తాగునీరు, డ్రైనీజీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికీ సిపిఎం బృందం శ్రీలంక కాలనీ పర్యటనలో శ్రీలంక శరనార్ధులు ఏదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం నిర్మించిన కాలనీ ఇండ్లు వర్షాకాలంలో ఉరుస్తుండటంలో సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకోవాల్సి వస్తోంది. శ్రీలంక కాలనీలో ఉంటున్న శరనార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి మెరుగైన వసతులు కల్పించాలని సిపిఎం నాయకులు శ్రీలంక కాలనీ వాసులు కోరుతున్నారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు చల్లా వెంకటయ్య, నగర కార్యదర్శి కె.సురేంద్రన్‌, నాయకులు లోకయ్య కాలనీ నాయకులు కైలాసం, కృష్ణస్వామి, లోకేష్‌ పాల్గొన్నారు.