Jun 16,2022 22:16

శ్రీలంక కాలనీవాసుల సమస్యలు పరిష్కరించండి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
రెడ్డిగుంట వద్ద శ్రీలంక శరణార్థుల కోసం నిర్మించి కాలనీ చెరువు నిండితే ముంపుకు గురై ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని, అధికారులు పట్టించుకొని శ్రీలంక శనణార్థులకు న్యాయం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి సురేంద్ర కోరారు. ఇంటింటికీ సిపిఎం కార్యక్రమంలో భాగంగా గురువారం రెడ్డిగుంట, శ్రీలంక కాలనీ, నెప్యూన్‌నగర్‌లో సిపిఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ రెడ్డిగుంట, యానాదికాలనీకి రోడ్లు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకు, డ్రైనేజీ లేకఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు. న్యూప్టూన్‌ నగర్‌లో రోడ్డు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థే లేదని, కనీసం శ్మశాన వాటికి కూడా లేదని తెలిపారు. అంతేకాకుండా శ్రీలంకకాలనీలో నివాసముంటున్న ప్రజలు వర్షాకాలంలో ముంపుకు గురౌతున్నారని, ఇండ్లలోకి వర్షపు నీరు రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు చల్లా వెంకటయ్య, దొరై, గణేష్‌, రాజా, ప్రేమ, సిద్దమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం
పలమనేరు: సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం నాయకులు అన్నారు. ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో భాగంగా గురువారం గంటవూరు కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఓబుల్‌ రాజు, పట్టణ కార్యదర్శి గిరిధర్‌గుప్తా మాట్లాడుతూ 20సంవత్సరాలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన కాలనీలలోని వీధులలో ఇప్పటివరకు డ్రైనేజీ కాలువలు నిర్మించలేదంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోందని విమర్శించారు. ఈప్రాంతాల వీధులలో పారిశుద్ధ్యం లోపించిందని అన్నారు. అదేవిధంగా సిమెంట్‌ రోడ్లు, తాగునీటి కుళాయిలు ఇప్పటికీ ఈ కాలనీలో లేవంటే అధికారులు ఏమాత్రం చిత్తశుద్ధితో పని పనిచేస్తున్నారో అర్థమవుతోందని అన్నారు. ఈకార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్‌, నాయకులు రాజా జయంతి రమణ, తదితరులు పాల్గొన్నారు.