Oct 11,2023 22:04

స్వీట్‌ తినిపించి టిడిపిలోకి ఆహ్వానిస్తున్న శిరీష

* టిడిపిలోకి ఆహ్వానం
ప్రజాశక్తి - పలాస: 
పలాస నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పావులు కదుపుతుంటే మరోవైపు ప్రతిపక్ష నాయకురాలు అదేస్థాయిలో పావులు కదుపు తుండడంతో రానున్న ఎన్నికల్లో రసవత్తరంతో ఎన్నికలు జరుగుతాయనే వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల పలాస మండలం చినంచలకు చెందిన స్వతంత్ర ఎంపిటిసి బమ్మిడి దుర్యోధన, మున్సిపాల్టీలో కొంతమంది నాయకుల ఇళ్లకు రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెళ్లి మంతనాలు చేసి వైసిపి కండువా వేశారు. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సోదరుడు, వైసిపి సీనియర్‌ నాయకులు, కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌ ఇంటికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష వెళ్లి టిడిపిలోకి రావాలని ఆహ్వానించారు. భవిష్యత్‌లో ఉన్నత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.