Sep 21,2023 22:04

శ్రీ వరసిద్ధునికి శ్రీశైలం మల్లన్న పట్టువస్త్రాలు
ప్రజాశక్తి- కాణిపాకం:

శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం, శ్రీశైలం ఆలయం నుండి పట్టు వస్త్రాలను దేవస్థానం శ్రీశైల దేవస్థానం ఈవో లవన్న, బోర్డు సభ్యులు జగదీశ్వర్‌రెడ్డి, విజయలక్ష్మి సమర్పించారు. వీరికి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశురాజగోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదలు, శేష వస్త్రం అందజేశారు. కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ఏఈవో మోహన్‌, కాణిపాకం దేవస్థానం ఏఈఓ కష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, స్వాములు ఉన్నారు.