Jun 10,2023 22:39

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆహ్వానం
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

               తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్‌ కళాశాల అటానమస్‌ను సాధించి ఇంజినీరింగ్‌ రెండో బ్యాచ్‌ పూర్తయిన సందర్భంగా ఈ నెల రెండో వారంలో నిర్వహించే గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ముప్పువరపు వెంకయ్యనాయుడును ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం శనివారం ఉదయం విజయవాడలో వెంకయ్యనాయుడును కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గ్రంధి సత్యనారాయణ, సెక్రటేరియట్‌ అండ్‌ కరెస్పాండెంట్‌ చల్లంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.రత్నాకరరావు, కళాశాల ఉపాధ్యక్షులు కోట్ల రామకృష్ణారావు, టెక్నికల్‌ డైరెక్టర్‌ చక్క అప్పారావు, డైరెక్టర్లు చలంచర్ల మురళి పాల్గొన్నారు.