Mar 25,2023 22:37

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
         తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న సాంకేతిక సింపోజియం లిటెక్‌-యుఫోరియా 2కె23 యువతీ యువకుల సాంస్కృతిక ప్రదర్శనల హోరుతో అట్టహాసంగా ముగిసింది. కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంధి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు మాట్లాడుతూ సాంకేతికోత్సవంలో ఉత్సహంగా పాల్గొని విజయవంతం చేసిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాంబాబు మాట్లాడుతూ సింపోజియంలో భాగంగా వివిధ విభాగాల్లో 38 అంశాల్లోనూ, కళాశాల స్థాయిలో ఏడు అంశాల్లోనూ పోటీలు నిర్వహించి ఉత్తమంగా నిలిచిన వాటికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించామని తెలిపారు.