Mar 05,2022 21:31

అమ్మవారి ఆలయం వద్ద జస్టీస్‌ ఎన్‌వి.రమణ.


ప్రజాశక్తి - తిరుపతి సిటి
అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలకగా. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ జేఈవో వి. వీర బ్రహ్మం దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదంతో తీర్థప్రసాదాలు స్వీకరించారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంట రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ రాజేష్‌ కుమార్‌ గోయల్‌, ప్రశాంత్‌ కుమార్‌ సూర్యదేవర, హైకోర్టు జడ్జి యు. దుర్గాప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డి. వెంకటరమణ, ఎ.వి రవీంద్రబాబు, జిల్లా జడ్జి వై.వి.ఎస్‌.బి.జి. పార్థసారథి, మూడవ అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, ప్రోటోకాల్‌ మెజిస్ట్రేట్‌ కోటేశ్వర రావు, డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, కోర్టు ప్రోటోకాల్‌ సూపరింటెండెంట్‌ ధనంజయ నాయుడు ఉన్నారు. అనంతరం తిరుమలకు బయల్దేరి వెళ్లారు. తిరుమలలో టిటిడి ఈవో కెఎస్‌ జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు.