Mar 31,2022 22:29

పాద పూజ చేస్తున్న విద్యార్ధులు



ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
గత మూడు రోజులగా జరుగుతున్న వేడుకల్లో పిల్లలకు కుటుంబం పట్ల ఉన్న బంధాలు, అనుబంధాల విలువలను పెంచడానికి ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఇదివరకెన్నడు ఇలాంటి కార్యక్రమాలు ఏ పాఠశాలల్లోనూ నిర్వహించలేదని, దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం సురేష్‌ మాట్లాడుతూ పిల్లలు కుటుంబ విలువలు గుర్తుంచుకుని, భవిష్యత్తులో ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అన్నపూర్ణ, ఏవో రవిబాబు, డీన్‌ రహంతుల్లా, ఐపీఎల్‌ ఇన్చార్జి మూర్తి, సి.బ్యాచ్‌ ఇంచార్జ్‌ వెంకయ్య, సివిల్స్‌ ఇన్చార్జ్‌ ఆముక్త, ప్రైమరీ ఇంచార్జ్‌, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్‌, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.