
విద్యుత్ వైర్లను సరిచేస్తున్న విద్యుత్‌శాఖ అధికారులు
'ప్రజాశక్తి' వార్తకు స్పందన
బూర్జ: ఎట్టకేలకు అల్లెన పంచాయతీ ప్రజలకు విద్యుత్ సమస్యలు తీరాయి. మండలంలోని అల్లెన పంచాయతీ ఏర్పాటైనప్పటి నుంచి విద్యుత్ లైన్‌మేన్ లేకపోవడంతో గ్రామస్తులతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమస్యపై ఇటీవల ప్రజాశక్తిలో 'విద్యుత్ కష్టాలు తీరేదెప్పుడో' అనే కథనం ప్రచురితమవ్వడంతో అధికారులు స్పందించారు. విద్యుత్ శాఖాధికారులు సోమవారం గ్రామానికి చేరుకొని ఇటీవల శ్మశాన వాటికకు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కిందకు ఒరగడంతో సరిచేశారు. అలాగే వైర్లు వేలాడుతూ ఉండడంతో వాటిని సరిచేసి ప్రమాదాలను నివారించారు. విద్యుత్ శాఖ ఎఇ అప్పన్న ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ ప్రతినిధి జడ్డు మహేశ్వరరావు, రైతులు ఉన్నారు.