May 15,2023 21:15

ధర్నా నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ సంఘాల ఐక్య వేదిక నాయకులు

        ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   సఫాయి కర్మాచారులకు ఉపాధి కల్పించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం సఫాయి కర్మాచారులకు ఉపాధి కల్పించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సఫాయి కర్మాచారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నోబులేసు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ మానటరింగ్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ చెన్నోళ్ల తిరుపాలు మాట్లాడుతూ సఫాయి కర్మాచారులకు జిఓ 30 ప్రకారం గతంలో పని చేసిన పారిశుధ్య కుటుంబాల సభ్యులకు స్థానిక మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం స్పందన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ ఎమ్‌.గౌతమిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో , ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు కుళ్లాయప్ప, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మందల పకీరప్ప, తరుణ్‌, ఓబులమ్మ, రాజలక్ష్మి, రుక్మిణి, నాగలక్ష్మి, ఇందిరా, ఆశాలత తదితరులు పాల్గొన్నారు.