Aug 04,2022 22:13

సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి:
మండల పరిధిలోని తీర్థం గ్రామపంచాయతీలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ నూతన భవనం గురువారం జనరల్‌ మేనేజర్‌ రవిశంకర్‌ ప్రారంభించారు. బ్యాంక్‌ మేనేజర్‌ సత్యనారాయణ జనరల్‌ మేనేజర్‌ రవిశంకర్‌కు చిత్తూరు నుంచి వచ్చిన వారు సిబ్బందికి స్వాగతం పలికి ఆహ్వానించారు అనంతరం జనరల్‌ మేనేజర్‌ మాట్లాడుతూ తీర్థం గ్రామంలో ఇంతకుముందు చిన్న బిల్డింగ్‌ ఉండేదని, కానీ ఇప్పుడుగ్రామానికి తగ్గట్టుగా విశాలంగా బ్యాంకు నిర్మించి తమకు అందించిన బాలజీ ముందుగా వారి శాఖ ద్వారా కతజ్ఞతలు తెలిపారు. ఏ బ్యాంకు చేయలేని విధంగా సేవింగ్‌ ధరలకు సిక్స్‌ పర్సెంట్‌ వడ్డీ మన బ్యాంకులో అందిస్తున్నామని ఖాతాదారులు దీన్ని వినియోగించుకోవాలన్నారు. రైతులకు, దుకాణదారులకు, వ్యాపారస్తులకు, వేరే ఇతర శాఖలకు అర్హతను బట్టి లోన్లు మంజూరు చేస్తా మని అన్నారు. దీనిని తమ బ్యాంక్‌ ఖాతాదారులు సేవలు అందరూ వినియోగించుకుంటారని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ రవి శంకర్‌, మేనేజర్‌ సత్యనారాయణ, బ్యాంక్‌, ఐకెపి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, సదాశివయ్య వీఆర్వో గోపాలకష్ణ, స్థానిక సర్పంచ్‌ జ్యోతి, శ్రీనివాస్‌, ఎంపీటీసీ తనయుడు, కేశవులు బ్యాంకు ఖాతాదారులు, గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.