Dec 12,2022 22:28

విడియో కాన్పెరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

స్పందనకు 154 అర్జీలు
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌
:స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని జిల్లా కలెక్టర్‌ హరి నారాయణన్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డా.ఎస్‌.వెంకటేశ్వర్‌, డి.ఆర్‌.ఓ ఎన్‌.రాజశేఖర్‌ లతో కలసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 154 అర్జీలు అందాయి.
ఫిజికల్‌ ప్రోగ్రెస్‌ సాధించాలి
రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, నిర్దేశించిన కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ ఎంపీడీవోలు, ఎంఈఓ లు నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, పనుల పురోగతిని పరీక్షించి నిధులు ఖర్చయ్యేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు బిల్లులను అప్లోడ్‌ చేయాలన్నారు. ప్రధానంగా జూనియర్‌ కళాశాలలో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ ఎ ఏపీసి వెంకటరమణారెడ్డి మండలాల వారీగా పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయేందర్‌ రావు పాల్గొన్నారు.

ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: మాండూస్‌ తుఫాను ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు ఎదురవ్వకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జి. ప్రకాశం తెలియజేశారు. ముఖ్యంగా ఆరోగ్య సిబ్బంది తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలోని ప్రతి ఇంటిని సందర్శించి, వారు యొక్క ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలన్నారు. ఇంటిగ్రేడెడ్‌ డిసిజ్‌ సర్వలెన్స్‌ కార్యక్రమము ద్వారా ఎక్కడైన జ్వరాలు, వాంతులు, విరేచనాలున్నచో ముందస్తు ప్రణాళికల ద్వారా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు.నీటి ట్యాంకులను శుభ్ర పరచడం, అలాగే క్లోరిన్‌ మాత్రలను పంచాలన్నారు. గర్బిణీలుటుంటే దగ్గరలోని ఆస్పత్రులకు తరలించాలన్నారు. కాచి వడబోసిన నీటిని తాగాలని, వేడిగా ఉన్న ఆహారాన్ని భుజించాలని తెలిపారు.