Aug 08,2022 22:57

'స్పందన'కు 145 అర్జీలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తంగా 145 అర్జీలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, డిఆర్‌ఓకు అందజేశారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 101, డిఆర్‌డిఎకు సంబంధించి 5, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి 3, హౌసింగ్‌కు సంబంధించి 9, సంక్షేమశాఖ సంబంధించి 6, పోలీసు శాఖలకు సంబంధించి 4, ఇతరులు17, అర్జీలు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు తీసుకుని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.