ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: స్పందన కార్యక్రమంలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో డిఆర్‌ఓ రాజశేఖర్‌లతో కలసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం.119 అర్జీలు రాగా, ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 85, వైద్యఆరోగ్య శాఖకు 5, హౌసింగ్‌కు 6, నగరపాలక సంస్థకు 3, సంక్షేమ శాఖకు 4, పోలీసు శాఖలకు 3, ఇతరులు 13 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారన్నారు. జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు తీసుకుని పరిష్కరించాల్సిందిగా డిఆర్‌ఓను, జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు










