Jul 25,2022 22:46

స్పందనకు 117 అర్జీలు : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌, డిఆర్‌ఓ రాజశేఖర్‌లతో కలసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 117 అర్జీలు రాగా, ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 97, డిఎంహెచ్‌ఓకు 4, మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 2, హౌసింగ్‌కు 6, డ్వామా శాఖ 1, పోలీసు శాఖలకు 1, డిఆర్‌డిఏ శాఖకు 1, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు 1, పశుసంవర్ధక శాఖకు 1, పంచాయత్‌ రాజ్‌శాఖకు 1, ఆర్‌టిసి శాఖకు 1, అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్‌, జేసి, డిఆర్‌ఓకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీ క్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు తీసుకుని పరిష్కరించాల్సిందిగా జెసి, జిల్లా అధికారులను ఆదేశించారు.