Jul 13,2022 22:52

'స్పందన' వినతుల పరిష్కారంలో అలసత్వం వద్దు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి ప్రాధాన్యతా అంశంగా స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించడం జరుగుతున్నదని, ఈ అంశంపై జిల్లా స్థాయి అధికారులందరూ ప్రత్యేక దష్టి సారించి వినతుల పరిష్కారంకు చర్యలు చేపట్టాలని జిల్లాకలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో స్పందన అర్జీల పరిష్కారంకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులకు రాష్ట్రస్థాయి అధికార బందంతో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో అందిన వినతులకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపుతూ తిరిగి రీ ఓపెన్‌కు తావు లేకుండా పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. స్పందన వినతులను నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలని, పరిష్కరించిన వినతులను ఏవిధంగా అప్రోడ్‌ చేయడం అందులో ఆర్ధిక, ఆర్థికేతర అంశాలు ఎండార్స్మెంట్‌, రీఓపెన్‌ కేసులకు తావు లేకుండా తగుసూచనలు, వినతికి సంబంధించి క్షేత్రస్థాయి నివేదికను జతపరచి సరైన పరిష్కారం చూపుతూ స్పందన పరిష్కార రసీదులో తప్పనిసరిగా సంబంధిత అధికారి సంతకం చేసిన తరువాత అప్లోడ్‌ చేయాలని, తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. వినతుల్లో భాగంగా ప్రభుత్వ పథకాల లబ్దిపొందేందుకు అర్హత ఉన్నట్లయితే సంబంధిత శాఖల అధికారులకు దానిని పంపడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, స్పందన డిపార్ట్‌మెంట్‌ కో ఆర్డినేటర్‌లు హేమంత్‌, రాజు, డ్వామా డిఆర్‌డిఏ పీడీలు చంద్రశేఖర్‌, తులసీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌ఈ వెంకటరమణ, డిఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ ఆర్‌ఆర్‌ రెడ్డి, డిసిహెచ్‌ ఎస్‌ డాక్టర్‌ నాయక్‌, డిపిఓ ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.