Oct 09,2023 20:54

చెక్కు అందజేస్తున్న దృశ్యం

5 చెక్కు అందజేస్తున్న దృశ్యం
స్పందించి ఆదుకోవడం అభినందనీయం
ప్రజాశక్తి-నెల్లూరు:పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల కాలంలో అకాల మరణం చెందిన పి.పోలయ్య కుటుంబానికి తోటి బ్యాచ్‌ కానిస్టేబుల్స్‌ స్పందించి ఆదుకోవడం అభినందనీయమని ఎస్‌పి డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం ఎస్‌పి కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎస్‌పి డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి చేతుల మీదుగా మృతి చెందిన కానిస్టేబుల్‌ భార్య త్రివేణికి ఒక లక్షా ఎనిమిది వేల రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ బాలాజీనగర్‌ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ పి.పోలయ్య ఇటీవల మృతి చెందడం ఎంతో భాదకరమన్నారు
. అయితే మరణించిన కానిస్టేబుల్‌ 2013వ బ్యాచ్‌కి చెందిన వాడు కావడంతో ఆ బ్యాచ్‌కి చెందిన సహచర పోలీసులు స్పందించి సేకరించిన ఒక లక్షా ఎనిమిది వేల రూపాయల నగదును ఎస్‌పి చేతుల మీదుగా మృతి చెందిన కానిస్టేబుల్‌ భార్య త్రివేణికి అందజేశారు. మృతి చెందిన తమ సహౌద్యోగి యొక్క కుటుంబానికి సహాయం అందించాలనే 2013 బ్యాచ్‌ వారి సంకల్పం,వారి సేవా దక్పథం ఎంతో గొప్పదన్నారు. ఇదే ఐక్యతను,ఉదారతను భవిష్యత్తులో సైతం కొనసాగించాలని సూచించారు. అదే విధంగా కానిస్టేబుల్‌ పి. పోలయ్య కుటుంబానికి పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ తోడుగా, అండగా ఉంటుందని, వారికి శాఖాపరంగా రావలసిన అన్ని బెనిఫిట్లను అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 2013 బ్యాచ్‌ పోలీసులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.