May 17,2022 22:05

స్పాట్‌ కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ను రద్దు చేయాలని, ఎస్‌ఎస్‌సి స్పాట్‌ వాల్యేషన్‌ రేట్లు పెంచాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మంగళవారం పిసిఆర్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌సి స్పాట్‌ వాల్యేషన్‌ కేంద్రం వద్ద ఫ్యాప్టో నేతృత్వంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ప్యాప్టో జిల్లా కోఛైర్మెన్‌ జివి రమణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్‌ ను రద్దు చేయాలన్నారు. అలాగే ఎస్‌ఎస్‌సి సమాధాన పత్రాలు దిద్దుతున్న ఉపాధ్యాయులకు ఇస్తున్న పారితోషకం పెంచాలన్నారు. ప్యాప్టో రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా స్పాట్‌కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు. ధర్నా అనతరం జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తంకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మదన మోహన్‌ రెడ్డి, నాధముని, గోపీ నాథ్‌, మునాఫ్‌, రమేష్‌, గంటా మోహన్‌, టి. రఘుపతి రెడ్డి, చెంగలరాయ మందడి, ముక్తార్‌ అహమ్మద్‌ పాల్గొన్నారు.