Jun 15,2022 23:15

సోనూసూద్‌ మనసు గెలిచిన గుడిపల్లి కళాకారుడు
ప్రజాశక్తి-గుడిపల్లి:

మండలంలోని పిపి.కుంట గ్రామానికి చెందిన పురుషోత్తం అనే కళాకారుడు బుధవారం హైదరాబాద్‌లో సోనుసూద్‌ చిత్రాన్ని చిత్రించాడు. దీంతో సోనుసూద్‌ ఆ కళాకారుని ప్రశంసించి ఫోటో దిగడంతో పాటూ కళను ప్రోత్సహించారు. అదేవిధంగా సోనుసూద్‌ ద్వారా గుడిపల్లి మండలంలో నిరుపేద కుటుంబాలకు వైద్యపరికరాలను కూడా అందజేయడం జరిగింది. ఇలాంటి సహాయ సహకారాలు కావాలనుకున్నవారు తనను కలవాలని కోరారు.