Mar 16,2022 16:19

ప్రజాశక్తి -కలకడ :మనిషిని చూస్తే మనిషికి శతృత్వం పెరుగుతున్న ఈ రోజుల్లో జంతువులు పక్షులు సైతం స్నేహపూర్వకంగా మెలుగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది .మండలంలోని అగ్రహారానికి చెందిన ఆసియా బేగం ఇంటిలో పక్షులను పెంచుకునే అలవాటు ఉండేది.ఈ క్రమంలో తన ఇంటిలో ఉన్న పక్షులలో బాతు పిల్ల, కోడి పిల్ల స్నేహంగా ఉంటూ అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తున్నాయి. కోడి పిల్ల, బాతు పిల్ల కలసి మెలసి ఉంటూ ఒకటి విడిచి, ఒకటి ఉండలేక పోతూ ఉండటం చూసి గ్రామంలోని ప్రజలు ఉత్తమ ఆచరణ నెట్టుకొస్తున్నారు. జంతువులు, పక్షులు కలిసిమెలిసి ఉండడం చూసిన ప్రతి ఒక్కరూ మనసులు కూడా ఇలాగే ఉంటే ఘర్షణలు ,మర్డర్లు ఎందుకు జరుగుతాయని పలువురు తమ వాదన వినిపిస్తున్నారు.