Oct 09,2023 17:34

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి -నెల్లూరు :జగనన్నకు చెబుదాం.. కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే అర్జీలకు సంతృప్తికరస్థాయిలో పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌, అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ తిక్కన ప్రాంగణంలో కలెక్టర్‌ హరినారాయణన్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌, డిఆర్‌ఒ వెంకట నారాయణమ్మ, జెడ్‌పి సిఇఒ చిరంజీవితో కలిసి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సంబంధిత శాఖల జిల్లా అధికారులు జగనన్నకు చెబుదాం.. కార్యక్రమంలో వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ధేశించిన గడువు లోగా పరిష్కరించేలా కషి చేయాలన్నారు. డిఆర్‌డిఎ, మెప్మా, హౌసింగ్‌ పిడిలు సాంబ శివారెడ్డి, రవీంద్ర, నాగరాజు, డిపిఓ సుస్మిత,ఇరిగేషన్‌, ఎస్పిడిసిఎల్‌ ఎస్‌ఈ లు కష్ణమోహన్‌, విజయన్‌, డీఈఓ గంగా భవాని, జిల్లా బిసి వెల్ఫేర్‌ అధికారి వెంకటయ్య, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి రమేష్‌ , జిల్లా రిజిస్ట్రార్‌ బాలాంజనేయులు ఉన్నారు.