Mar 20,2022 22:22

అవగాహన కల్పిస్తున్న ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ సుభాషిణి


ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌:
ఆదివారం సుభాషిని ఆసుపత్రిలోని గర్భధారణ కేంద్రంలో పిల్లలు లేని వారికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 450 మందికి ఉచితంగా మహిళలకు రక్త పరీక్షలు, పురుషులకు వీర్య పరీక్షలు చేసి సలహాలు, సూచనలు అందించారు. పిల్లలు లేని వారికి ఉచితంగా వైద్య సేవలు అందించనున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి సీఈవో కొడాలి శ్రీనివాసులు కోరారు. ఉచిత రిజిస్ట్రేషన్ల కోసం 8500507799, 9105050505, 08577-263646 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నివేదిత, డాక్టర్‌ పల్లవి, చీఫ్‌ అడ్వైజర్‌ ప్రభాకర్‌, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.