ప్రజాశక్తి- రేణిగుంట: మండలం లోని వారవు సంతను సోమవారం అర్బన్ ఎస్పీ వెంకటప్పనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేణిగుంట సర్పంచ్ నగేష్‌కు పలు సూచనలు చేశారు. అలాగే ఆయన ప్రజలకు, వ్యాపారస్తులకు సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. దుకాణాలు ఒక క్రమ పద్ధతిలో నిర్వహించా లన్నారు. ప్రధానంగా సంత సమయంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు సూచనలు చేసారు. వ్యాపారస్తులకు, ప్రజలకు వేరువేరుగా పార్కింగ్ స్థలం కేటాయించాలని సర్పంచ్‌ను కోరారు. శనివారం రోజు సంత ప్రదేశంలో వాహనాలు రాకుండా నియంత్రించాలన్నారు. మైక్ సెట్ ద్వారా నిరంతరం ప్రజలుకు సూచనలు చేయాలన్నారు. తక్షణమే పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ ఆదేశాలతో రేణిగుంట సర్పంచ్ నగేశం, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, వైసీపీ నాయకులు అబ్దుల్ ఖదీర్, సుభాన్ రాజా, షబ్బీర్ అలీ, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. గాజులమండ్యం, పాత చెక్ పోస్టు మీదుగా వచ్చే వారికి ఎల్లమ్మ గుడి వద్ద పార్కింగ్ స్థలం కేటాయించనున్నారు. అలాగే రేణిగుంట నుండి వెళ్లేవారికి పద్మా థియేటర్ పక్క సందులో పార్కింగ్ చేసేలా స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి రామచంద్ర, అర్బన్ సిఐ అంజుయాదవ్, అర్బన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.










