మాట్లాడుతున్న నాయకులు
సంపూర్ణ ఆరోగ్య రాష్ట్రంగా ఎపి
ప్రజాశక్తి-సీతారామపురం:సంపూర్ణ ఆరోగ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఉంచడానికి సిఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకొని అడుగులు వేస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వైసిపి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని మారం రెడ్డి పల్లి సచివాలయంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోగులకు చేస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పేదల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు ఆనందాన్ని అందించాలని గొప్ప సంకల్పంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఆరోగ్య సురక్షలో భాగంగా ప్రతి ఇంట్లోని కుటుంబ సభ్యులకు అవసరమైన ఏడు రకాల పరీక్షలు చేసి వారి ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి చెరుకుపల్లి రమణారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి, ప్రధానమంత్రి 15 సూత్రాల కమిటీ మెంబర్ కలివేల ఎలీషా కుమార్, తహశీల్దార్ ఎం.వి. సుధాకర్ బాబు, ఎంపీడీఓ రంగ సుబ్బరాయుడు, వైస్ ఎంపీపీ బసిరెడ్డి కష్ణారెడ్డి, సర్పంచ్ గాజులపల్లి భారతి చంద్ర రెడ్డి, వైద్యాధికారిని ఎ.స్వప్న, అధికారులు నాయకులు పాల్గొన్నారు.










