Oct 24,2023 20:03

మాట్లాడుతున్న మాజీమంత్రి నారాయణ


మాట్లాడుతున్న మాజీమంత్రి నారాయణ
సంక్షేమంతో పాటు అభివద్ధికి బాటలు వేస్తాం..
మాజీ మంత్రి పొంగూరు నారాయణ
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ.. అభివద్ధికి బాటలు వేస్తామని దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు స్టోన్‌ హౌస్‌ పేట లోని కన్యకా పరమేశ్వరి అమ్మవారిని, కోదండ రామాపురం, బాబు గిరిజన కాలనీలోని శ్రీ మహాలక్ష్మి ఆలయాలను మంగళవారం ఆయన దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు, దీవెనలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని త్వరలోనే నిజాయతీగా నారా చంద్రబాబు నాయుడు బయటకు వస్తారనే ఆశాభవం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో అభివద్ధి ఎక్కడ కనిపించడం లేదన్నారు. దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో పక్కదారి పట్టే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రాబోవు 2024 ఎన్నికల్లో టిడిపి విజయ ఢంకా మోగడం తథ్యమన్నారు. కార్యక్రమంలో టిడిపి నేతలు తాళ్లపాక రమేష్‌ రెడ్డి, ప్రవీణ్‌, అనురాధ, విజేత రెడ్డి, కపిర నరసింహులు, రేవతి తదితరులు పాల్గొన్నారు.